2009కి ముందు కేసీఆర్ ఆస్తులెన్ని? ఇప్పుడెన్ని

నల్గొండ జిల్లా:2009 కి ముందు కేసీఆర్ ఆస్తులెన్ని?ఇప్పుడెన్ని?కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కోసం కాదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

బుధవారం చండూర్ మండల కేంద్రంలోని బీఆర్సీ ఫంక్షన్ హాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల పేరుతో నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తల సమావేశానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు చెందిన 500 మంది బీజేపీలో చేరారు.వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

How Many Assets Did KCR Have Before 2009? Now-2009కి ముందు కే�

అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నేను ధైర్యంగా రాజీనామా చేసి పార్టీ మారితే అమ్ముడుపోయాడని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.నేను రాజీనామా చేసినాకే కేసీఆర్ మునుగోడుకి వచ్చాడు.2014 ముందు కేసీఆర్ ఆస్తి ఎంత ఇప్పుడెంతో ప్రజలకు చెప్పాలన్నారు.నేను నా సొంత ఆస్తులు అమ్ముకొని ప్రజలకి సేవ చేస్తున్నానని,కరోనా సమయంలో నియోజకవర్గం అంతా నిత్యవసర వస్తువులు వేల కుటుంబాలకు పంపిణీ చేశానని గుర్తు చేశారు.2009లో జగదీష్ రెడ్డి ఆస్తి ఎంత?ఇప్పుడెంతో కూడా ప్రకటించాలని సవాల్ విసిరారు.అవినీతి సొమ్ముతో మునుగోడులో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఒక బుడ్డోడు,టిఆర్ఎస్ పార్టీలో మంత్రి జగదీష్ రెడ్డి ఒక బుడ్డోడు అని ఏద్దేవా చేశారు.తెలంగాణ కోసం ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో యుద్ధం చేశాను.

Advertisement

కానీ,రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబు నీడలో ఉన్నాడన్నారు.కేసీఆర్ అహంకారాన్ని దెబ్బ కొట్టాలంటే మునుగోడులో బీజేపీ గెలవాలని,నేను వెయ్యి సంవత్సరాలు బ్రతకనని,బ్రతికిన కొద్ది రోజులు ప్రజా జీవితంలోనే ఉండి ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటానన్నారు.

ఇప్పుడు జరిగే ఈ ధర్మయుద్ధంలో మీరందరూ కులాలకు,మతాలకు,పార్టీలకు అతీతంగా ధర్మాన్ని గెలిపించి మునుగోడు ఆత్మగౌరవన్నీ నిలబెట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం,చండూర్ మండల బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News