హిందీ పండిట్ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు...!

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం( Vemulapally ) రావులపెంట గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొంత కాలంగా హిందీ పండిట్ లేక సిలబస్ పూర్తి కాక విద్యార్థులు తీవ్ర ఆందోళనచెందుతున్నారు.

మరో రెండు నెలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ( SSC 10th Exams )ఉండడంతో హిందీ సబ్జెక్ట్ సిలబస్ చెప్పే పండిట్ లేడని,ఎలా పరీక్ష రాయాలని మనోవేదనకు గురవుతున్నారు.

పదవ తరగతిలో ఉత్తమ స్కోరు సాధించడానికి హిందీ సబ్జెక్ట్ తోడ్పడుతుంది.అసలు సబ్జెక్ట్ బోధించకుండా పబ్లిక్ పరీక్ష పరిస్థితి ఏమిటని స్టూడెంట్స్ తర్జనభజన పడుతున్నారు.

హై స్కూల్( High School ) ప్రతి సంవత్సరం పబ్లిక్ పరీక్షలులో మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తుంది.ఇలాంటి పాఠశాలలో హిందీ పండిట్ లేకుండా చేసి హిందీ బోధన లేకుండా చేసి విద్యార్థులను గాలి వదిలేశారు.

విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఇప్పటికైనా హిందీ పండిట్ ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.లేదంటే ఈ సారి తమ పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

Advertisement
తిప్పర్తిలో జూ.కళాశాల స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Latest Nalgonda News