మార్చిలోనే మొదట్లోనే సుర్రుమంటున్న సూరీడు

నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.మరీ ముఖ్యంగా శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి.

గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత వాతావరణం నెలకొంటుంది.దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

High Temperatures At The Beginning Of March, High Temperatures , March, Summer,

మరీ ముఖ్యంగా శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి.గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత వాతావరణం నెలకొంటుంది.

దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.కొన్ని జిల్లాలో 38 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

గర్బిణీలు,బాలింతలు,చిన్నపిల్లలు,వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి.ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోనుంది రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ.ఎండలపై సమాచారం కోసం విపత్తుల సంస్థ 112,1070,18004250101 టోల్ ఫ్రీ నెంబర్లను పేర్కొంది.ప్రజలకు ఎప్పటికప్పుడూ వడగాల్పుల హెచ్చరిక సందేశాలు అందుతాయని తెలిపింది.

తీవ్రమైన ఎండల సమయంలో ప్రజలందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ పేర్కొన్నారు.అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటికి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన చిరుత.. దెబ్బకి దడుసుకున్న పోలీసు!
Advertisement

Latest Nalgonda News