ఎర్ర కందిపప్పు అద్భుతమైన పప్పు ధాన్యాల్లో ఇది ఒకటి.ఎర్ర కంది పప్పు రుచిగా ఉండటమే కాదు.
పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ ఇలా పోషక విలువలెన్నో నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా ఎర్ర కంది పప్పు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
ముఖ్యంగా వారంలో రెండంటే రెండు సార్లు ఎర్ర కంది పప్పును తీసుకుంటే మస్తు హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.మరి ఆ బెనిఫిట్స్ ఏంటీ.? అసలు ఎర్ర కందిపప్పును ఏయే రూపంలో తీసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎర్ర కందిపప్పును ఏదైనా ఆకు కూరతో వండుకుని తినొచ్చు.ఎర్ర కందిపప్పుతో సంబార్ పెట్టుకుని తీసుకోవచ్చు.ఎర్ర కందిపప్పు టమాటో కలిపి వండుకుని తినొచ్చు.ఇలా ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే.
వారానికి రెండు సార్లు ఈ పప్పును తీసుకుంటే గనుక శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.
ఎర్ర కందిపప్పు త్వరగా జీర్ణం అయిపోవడమే కాదు.జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగ్గా మారుస్తుంది.దాంతో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అలాగే పైన చెప్పినట్లు ఎర్ర కంది పప్పులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.అందువల్ల గర్భిణీ స్త్రీలు ఎర్ర కంది పప్పును ఆహారంలో భాగంగా చేసుకుంటే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది.
అంతే కాదు, ఎర్ర కందిపప్పును వారంలో రెండు సార్లు తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.వెయిట్ లాస్ అవుతారు.నీరసం, అలసట వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.హెయిర్ ఫాల్ సమస్య తగ్గు ముఖం పడుతుంది.
మరియు ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.