తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా నియమించింది.దాదాపు రేవంత్ రెడ్డిని( Revanth Reddy ) ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం కనిపిస్తోంది.
మొత్తం కాంగ్రెస్ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలలో 50 మంది వరకు రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తుండడంతో, రేవంత్ పేరే ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది .ఇక ముఖ్యమంత్రి రేసులో తాము ఉన్నామని, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తాము ఎంతగానో కష్టపడ్డామని, సీనియర్ నేతలు మల్లు బట్టు విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు అధిష్టానం పై ఒత్తిడి చేస్తున్నారట.అయితే రేవంత్ రెడ్డి భట్టు విక్రమార్కల పేర్లనే అధిష్టానం పరిగణలోకి తీసుకుంది.దాదాపు రేవంత్ రెడ్డి పేరుని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా ఏఐసిసి వర్గాలు పేర్కొంటున్నాయి.
సీఎం పదవి విషయంలో ఒక క్లారిటీ వస్తున్నా, మిగతా మంత్రుల ఎంపిక విషయమై కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది.ముఖ్యమంత్రిగా అవకాశం దక్కకపోతే మల్లు భట్టు విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఖరారు చేస్తున్నారట.అయితే ములుగు ఎమ్మెల్యే సేతక్క( Seethakka )కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం .అయితే ఉప ముఖ్యమంత్రి ఒక్కరే ఉండాలని, ఇద్దరు ఉంటే విలువ ఉండదని భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట.
కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ), మంత్రి పదవుల విషయంలోనైనా తమ పేర్లను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారట.అయితే ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం కష్టం అయితే, తనకు కాకపోయినా తన భార్య పద్మావతికి మహిళా కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదన పెట్టారట.ఇక ఏ ఏ శాఖలు ఎవరెవరికి ఇవ్వాలి ? ఎవరిని మంత్రులుగా ఎంపిక చేయాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టిందట.