టైర్ల స్మశానం ఎప్పుడైనా చూశారా.. ఇది ఎంత పెద్దదో తెలిస్తే..

సాధారణంగా ఒకచోట 1,000 టైర్లను వేస్తేనే చాలా స్థలం నిండిపోతుంది.అలాంటిది ఒక దేశంలో లక్షల కొద్ది టైర్లను ఒకే దగ్గర వేస్తారు.

 Have You Ever Seen The Tire Graveyard If You Know How Big It Is, Tyres, Tyres Gr-TeluguStop.com

అరిగిపోయిన, పాడైపోయిన టైర్లన్నీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పడేస్తారు.అక్కడే వాటిని కాల్చేస్తారు.

అందుకే ఈ ప్రాంతాన్ని టైర్ల స్మశాన వాటికగా ( graveyard of tires )పిలుస్తారు.ఈ ప్రాంతం కువైట్ నగరానికి దక్షిణంగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సులైబియాలో( Sulaibia ) ఉంది.

ఈ ప్రదేశానికి వెళ్లి ఎటు చూసినా టైర్లే కనిపిస్తాయి.కొన్ని కిలోమీటర్ల వరకు కనుచూపుమేర టైర్లు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తాయి.

Telugu Kuwait, Latest, Graveyard-Latest News - Telugu

కువైట్‌లోని టైర్ శ్మశానవాటికను ప్రపంచంలోని అతిపెద్ద టైర్ శ్మశానవాటిక అని పిలుస్తారు.టైర్ స్మశాన స్థలం విస్తారమైన ప్రదేశంలో విస్తరించి ఉంది, ఇది మిలియన్ల కొద్దీ వాడి పడేసిన టైర్లతో పర్యావరణానికి సంబంధించిన ముఖ్యమైన అంశంగా మారింది.1990వ దశకంలో గల్ఫ్ యుద్ధ సమయంలో సైనిక అవసరాల కోసం అనేక టైర్లను ఈ ప్రాంతానికి తీసుకువచ్చేవారు.అప్పటినుంచి ఈ స్మశాన వాటికలో టైర్లు పేరుకుపోవడం ప్రారంభమైంది.

యుద్ధం తరువాత, సైనికులు టైర్లను అక్కడే వదిలివేశారు.ఇది టైర్ స్మశానవాటిక సృష్టికి దారితీసింది.

Telugu Kuwait, Latest, Graveyard-Latest News - Telugu

సాధారణంగా ఒక టైరు 30 వేల కిలోమీటర్ల తరువాత నిరూపయోగంగా మారుతుంది.వాటితో వాహనాలు నడపటం కుదరదని తెలిసినాక వాటిని పడేయక తప్పదు.ఎందుకంటే వీటిని రీసైకిల్ చేయడం దాదాపు అసాధ్యం.ఒకవేళ టైర్లను కరిగించి రీసైకిల్ చేయాలని చూస్తే అది కాలుష్యానికి దారి తీయవచ్చు.పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.ఇక ప్రపంచంలో ఏటా 150 కోట్ల టైర్లు అరిగిపోయి చెత్త కుప్పకు చేరుకుంటున్నాయి.

వీటి వ్యర్థాలను కొందరు కాల్చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube