ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ మేక్‌మైట్రిప్ ( MakeMyTrip )తాజాగా “ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఇన్‌క్రెడిబుల్ ప్రైసెస్” అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.వివిధ గమ్యస్థానాలకు అత్యంత సరసమైన ఫ్లైట్స్ ఏమేం అందుబాటులో ఉన్నాయో తెలుపుతూ ప్రయాణికులు భారతదేశంలో విరామ పర్యటనలను ఈజీగా బుక్ చేసుకోవడాన్ని ఈ ఫీచర్ సులభతరం చేస్తుంది.
అంతేకాదు, యూజర్లు ప్రయాణించే నెల, కోరుకునే యాత్ర రకం ఆధారంగా విమానాలను ఫిల్టర్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఈ ఫీచర్ ప్రతి గమ్యస్థానంలో చేయవలసిన ముఖ్య విషయాల గురించి సమాచారాన్ని అందిస్తుంది, ప్రయాణికులకు కేవలం కొన్ని క్లిక్‌లలో వివిధ ప్రదేశాల పూర్తి వీక్షణను అందిస్తుంది.
కరోనా సమయంలో, చాలా మంది భారతీయ ప్రయాణికులు( Indian travelers ) తమ సొంత దేశాన్ని మునుపటి కంటే ఎక్కువగా అన్వేషించడం ప్రారంభించారు, ఇది ట్రావెల్ ఇండస్ట్రీలో నిరంతర వృద్ధికి దారితీసింది.

మేక్‌మైట్రిప్ 22-30 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ప్రయాణికులు, అలాగే 36-45 సంవత్సరాల మధ్య ఉన్నవారు కొత్త సాహసాలను అనుభవించాలని తపన పడుతున్నట్లు గమనించింది.ఈ ప్రయాణికులు ఏటా అనేక వెకేషన్స్ లేదా లీజర్ ట్రిప్స్ బుక్ చేసుకుంటారని కూడా తెలుసుకుంది.కొత్త ప్రదేశాలను కనుగొనే ప్రతి అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటారని గ్రహించింది.

అయితే, ఆ ప్రయాణికులు నెక్స్ట్ ట్రిప్‌ని ప్లాన్ చేస్తున్నప్పుడు, విమాన టిక్కెట్‌ల ధర కొన్నిసార్లు వెళ్లాల్సిన చోటుకు వెళ్లకుండా ఆపుతుంటుంది.వ్యాపారం కోసం ప్రయాణించే వారితో పోలిస్తే విరామ యాత్రల కోసం వెతుకుతున్న వ్యక్తులు విమాన ధరల కోసం ఎక్కువ సమయం వెతుకుతున్నారని మేక్‌మైట్రిప్ కనుగొంది.ఈ సమస్యను అధి పరిష్కరించాలనుకుంది.అందుకే ఈ కొత్త ఫీచర్‌తో ప్రజలు విశ్రాంతి ప్రయాణాల కోసం విమానాలను బుక్ చేసుకునే విధానాన్ని మార్చేసింది.ప్లాట్‌ఫామ్‌లోని ఇన్‌క్రెడిబుల్ ఇండియా విభాగంలో గమ్యస్థానాలను అన్వేషించే 60% కంటే ఎక్కువ మంది వినియోగదారులు తమ టిక్కెట్‌లను కనీసం 30 రోజుల ముందుగానే బుక్ చేసుకుంటారని, ఇది తక్కువ ధరలను పొందేందుకు వీలు కల్పిస్తుందని కంపెనీ తెలిపింది.







