తక్షణం ధాన్యం,పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

నల్లగొండ జిల్లా:అన్నదాతలు చేతికి వచ్చిన వరి పంటను అప్పుడే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రాశులుగా పోశారని,తక్షణం ఆయా ధాన్య కొనుగోలు కేంద్రాలలో కనీసం అవసరాలను ఏర్పాటు చేయాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.శుక్రవారం నార్కట్‌పల్లిలోని జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పత్తి మద్దతు ధరను క్వింటాకు రూ.

8,200 లకు పెంచాలని, రైతాంగానికి మద్దతు ధర పెంచిన విధంగా హమాలి ఛార్జీ పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు.పిఏసీఎస్,ఐకెపిలకు వచ్చే కమీషన్ నుండి హమాలీలకు ఒక సంవత్సరం జనరల్ ఇన్సూరెన్స్,రెండు జతల బట్టలు ఇవ్వాలన్నారు.

Grain And Cotton Purchase Centers Should Be Set Up Immediately-తక్షణ�

పల్లగొర్ల వీరయ్యయాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు ఉయ్యాల లింగస్వామిగౌడ్, పోతెపాక విజయ్,వర్కాల సైదులు,బాసాని శంకరయ్య,కన్నెబోయిన సైదులు,నారబోయిన సైదులు,మేడి స్వామి,బుర్రి ఎల్లయ్య,బాతుక మల్లయ్యయాదవ్,దేశపాక రామలింగయ్య, దూడల యాదయ్య,తిరగమళ్ళ యాదయ్య, ఆవుల నాగరాజు,మాదరబోయిన సత్తయ్య, చింత యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News