ప్రభుత్వ టీచర్లు టెట్‌ రాయడానికి అనుమతి అవసరం లేదు: విద్యాశాఖ

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్‌ రాయాలంటే ముందస్తు అనుమతి పొందాల్సిన అసవరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.

ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌ క్లారిటీ గురువారం ఇచ్చారు.

టెట్‌ రాయాలనుకునే ఉపాధ్యాయులు ముందస్తుగా విద్యాశాఖ అనుమతి తీసుకోవాలని నిన్నటి నుంచి వార్తలు వినిపించాయి.ఈ వార్త ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఆయోమయానికి దారితీసింది.

నిజంగా విద్యా శాఖ ఆ రకమైన ఆదేశాలు జారీ చేసిందా.? లేక పుకారా అనేది అర్దంకాక టీచర్లు అయోమయంలో పడ్డారు.ఈ క్రమంలో విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Latest Nalgonda News