ప్రభుత్వం మొద్దు నిద్ర ..మళ్లీ ఎంసెట్‌ ఫలితాల్లో గందరగోళం

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎంసెట్ 2020 ఫలితాలు మంగళవారం మధ్యాహ్నాం 3.30 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే , తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొంది.ఈ ఏడాది కూడా కూడా ఉన్నత విద్యామండలి తీరులో ఏ మాత్రం మార్పురాలేదు.ఎంసెట్‌ ర్యాంకుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి.

 Ts , Ts Emcet , Sabhita Indhra Reddy , Tsgovt, Emcet Result-TeluguStop.com

ఎంసెట్‌ లో కటాఫ్ మార్కులు వచ్చినప్పటికీ , ఇంటర్మీడియట్‌‌ అన్ని సబ్జెక్టుల్లో పాసైనప్పటికీ ,ఎంసెట్ ఫలితాల్లో మాత్రం ఫెయిల్డ్ ఇన్ క్వాలి ఫైయింగ్ ఫలితం వస్తోంది.

ఈ ఫలితాలను చూసి ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు షాక్ అవుతున్పారు.అయితే పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు సైతం ర్యాంకులు కేటాయించారు.కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయి ప్రమోటైన వారికి కూడా ర్యాంకులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది.అయితే, ఈ ఏడాది కరోనా కారణంగా ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులని పాస్ చేసింది ప్రభుత్వం.

అయితే , దాన్ని అనుసందాన్నం చేయడంలో మాత్రం సంబంధిత అధికారులు మరోసారి మొద్దు నిద్ర వీడలేదు.

కాగా, తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం నెలకొనడం పై ఏబీవీపీ నేత మురళి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యారంగం ఒకటుందనే సోయ అసలు తెలంగాణ ప్రభుత్వానికి లేకపోవడమే ఈ గందరగోళానికి కారణమని ఆయన ఆరోపించారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఉన్నత విద్యాశాఖకు పూర్తి అధికారాలు లేకపోవడం కూడా ఒక ప్రధానమైన సమస్య అని ఆయన తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube