గోల్డెన్ బెర్రీ సాగు చేస్తే ఆదాయం లక్షల్లో.. మెరుగైన సస్యరక్షక పద్ధతులు..!

వ్యవసాయ రంగంలో ఎన్నో అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.కాబట్టి రైతులు కొత్త పంటలు సాగు చేసి అధిక దిగుబడి పొందడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు.

 Golden Berry Farming Methods..! , Golden Berry , Golden Berry Farming , Maharash-TeluguStop.com

అయితే కొత్త పంటలపై పూర్తి అవగాహన కల్పించుకుంటే మంచి దిగుబడితో పాటు లక్షల్లో ఆదాయాన్ని అర్జించవచ్చు.తెలుగు రాష్ట్రాలలో( Telugu States )ఉండే ప్రజలు కొత్త పంటలైన స్ట్రాబెరీ, డ్రాగన్, అవకాడో లాంటి పంటలు పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.

అయితే గోల్డెన్ బెర్రీ సాగు చేయడానికి తెలుగు రాష్ట్రాలలో ఉండే నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి.మార్కెట్లో గోల్డెన్ బెర్రీ( Golden berry) కు డిమాండ్ ఉండడంతో చాలామంది అవగాహన లేక సాగు చేయడానికి ఆసక్తి చూపించలేకపోతున్నారు.

ఇప్పుడు మనం గోల్డెన్ బెర్రీ సాగు సస్యరక్షక పద్ధతులు పాటించి ఎలా చేయాలో అనే వివరాలు చూద్దాం.

Telugu Agriculture, Andhra Pradesh, Farmers, Golden Berry, Latest Telugu, Mahara

మహారాష్ట్ర( Maharashtra )లోని పలు నర్సరీలలో ఈ గోల్డెన్ స్ట్రాబెరీ మొక్కలు అందుబాటులో ఉన్నాయి.ఒక ఎకరం విస్తీర్ణంలో దాదాపుగా 15 వేల మొక్కలు అవసరం అవుతాయి.ఒక మొక్క ధర దాదాపు రూ.10 ఉంటుంది.ఈ మొక్కలను పంట పొలంలో రెండు అడుగుల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.వరుసల మధ్య 2.5 అడుగుల దూరం ఉండేటట్లు చూసుకోవాలి.ఉష్ణోగ్రత ఐదు నుంచి పది డిగ్రీల మధ్య ఉంటే కాలాలలో ఈ పంట లో అధిక దిగుబడి పొందవచ్చు.అంటే డిసెంబర్, జనవరి నెలలలో విత్తుకోవాలి.

Telugu Agriculture, Andhra Pradesh, Farmers, Golden Berry, Latest Telugu, Mahara

పంట వేసిన 70 రోజులకు పంట కాపు కు వస్తుంది.ఒక మొక్క నుంచి దాదాపుగా రెండు కిలోల దిగుబడి పొందవచ్చు.మార్కెట్లో గోల్డెన్ బెర్రీ కిలో ధర రూ.600 పైనే ఉంటుంది.కాబట్టి ఒక ఎకరం విస్తీర్ణంలో సాగు చేసిన మంచి ఆదాయం పొందవచ్చు.వర్షాకాలంలో ఈ పంటను సాగు చేస్తే మొక్క కుళ్ళడం, కాయ కుళ్లడం, కాయ రంగు మారడం జరుగుతుంది.

కాబట్టి సెప్టెంబర్ తర్వాత విత్తుకుంటే ఎటువంటి నష్టం ఉండకుండా అధిక దిగుబడి పొందవచ్చు.ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యానవన శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube