పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..

అడవి జంతువులు జనావాసాల్లోకి వచ్చి చాలా క్రూరంగా దాడులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ గుండెల్లో వణుకు పుట్టింస్తుంటాయి.ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి ఓ భయానక వీడియో వైరల్( Viral Video ) అవుతోంది.

 Giant Schnauzer Attacked By Mountain Lion Video Viral Details, Viral Animal Vide-TeluguStop.com

ఈ వీడియోలో ఒక పర్వత సింహం,( Mountain Lion ) ఒక జెయింట్ ష్నాజర్( Giant Schnauzer ) కుక్క మధ్య జరిగిన భయంకరమైన పోట్లాట కనిపించింది.ఈ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఒక పెద్ద జంతువుతో చిన్న కుక్క ఎలా పోరాడిందో చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఒక పర్వత సింహం ఒక ఇంటి ఆవరణలోకి కామ్‌గా వచ్చి, అక్కడ ప్రశాంతంగా కూర్చున్న ఒక నల్లని జెయింట్ ష్నాజర్ కుక్కను దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది.పర్వత సింహం కుక్క దగ్గరకు వెళ్లి, అకస్మాత్తుగా దాడి చేయడంతో కుక్కకు బ్రతికే అవకాశం లేదని అనిపించింది.కానీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఆ కుక్క ధైర్యంగా పోరాడుతూ తన బలాన్ని చూపించింది.

రెండింటి మధ్య జరిగిన భయంకరమైన పోరాటంలో, కుక్క ఆ పెద్ద జంతువును ఎదుర్కొంది.కొన్ని క్షణాల పాటు జరిగిన ఈ పోరాటం చూసినవారిని ఉత్కంఠలో ముంచెత్తింది.చివరకు, అన్ని అంచనాలను తారుమారు చేస్తూ, ఆ కుక్క విజయం సాధించింది.ఇంతటి పెద్ద జంతువును తనంతట తాను కాపాడుకోవడం చూసి అందరూ వావ్ అంటున్నారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోగానే, చాలా మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు.కొందరు ఆ కుక్క ధైర్యంగా పోరాడిందని అంటే, మరికొందరు అది అదృష్టం వల్ల బతికిందని అన్నారు.మరికొందరు తమ పెంపుడు జంతువులకు( Pet Animals ) గొలుసులు వేయాలని సూచించారు.ఇంకొందరు పర్వత సింహం కుక్కను చంపాలని మాత్రమే అనుకుందా, లేక చంపి తినాలని అనుకుందా అని ప్రశ్నించారు.

ఈ వీడియో మనకు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.అదేమిటంటే, ప్రకృతి ఎప్పుడూ అంచనా వేయలేనిది.ఒక చిన్న కుక్క ఇంత పెద్ద జంతువును ఎదుర్కొని బతికిందంటే అది ఎంతటి ధైర్యం!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube