అమెరికా నిరసనల్లో గాంధీ మహాల్ దగ్ధం..!!!!

అమెరికా పోలీసు అధికారి అమానుషంగా నల్ల జాతీయుడిని తన కాలికింద తొక్కి చంపిన విషయం విధితమే.ఆ పరిణామంతో ఒక్క సారిగా అమెరికాలో నిరసనలు మిన్నంటాయి.

 Gandhi Mahal, Washing\ton,america,protesters, George Floyd Death, Blackman-TeluguStop.com

కార్లు, వివిధ వాహనాలు, పోలీసు కార్లు దగ్ధం చేసేశారు నిరసన కారులు.అందినంత దోచుకుని పరరవుతున్నారు.

బెదిరింపులకి దిగుతున్నారు.పోలీసులు ఎంతగా కట్టడి చేయాలనీ చూస్తున్నా వారిని అదుపు చేయడం ఎవరి వల్లా కావడం లేదు.

నల్ల జాతీయుడు సృష్టిస్తున్న అల్లర్లలో ఎన్నో దుకాణాలు హోటల్స్ కూడా దగ్ధమై పోతున్నాయి.తీవ్రమైన ఆస్తి నష్ట జరుగుతోంది.ఈ అల్లర్లలోనే అమెరికాలో ఉన్న ఓ ఇండియన్ రెస్టారెంట్ కూడా తగలబడిపోయింది.మిన్నియాపాలిస్ లో ఉండే ఎంతో మంది భారతీయులకి సుపరిచితమైన ఈ గాంధీ మహాల్ కి నిరసన కారులు నిప్పు పెట్టారు.

అయితే ఈ దుర్ఘటనపై గాంధీ మహాల్ యజమాని స్పందించిన తీరు నిరసన కారులని కదిలించింది.

గాంధీ మహాల్ కాలిపోయిన తరువాత ఆ హోటల్ యజమాని మాట్లాడుతూ ఈ నిరసనల్లో నా హోటల్ కాలిపోయింది.నాకు ఎంతో నష్టం కలిగింది.అయినా నేను బాధపడను కానీ జార్జ్ ఫ్లాయిడ్ కి న్యాయం జరగాలి.

అతడి మరణానికి కారణమైన పోలీసులకు శిక్ష పడాలి అంటూ వ్యాఖ్యానించారు.ఆ హోటల్ యజమాని కూతురు హఫ్స నిరసన కారులకి మద్దతు తెలుపుతున్నాను అంటూ కాలిపోయిన తమ హోటల్ సోషల్ మీడియాలో ఫోటో పెట్టి పోస్ట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube