హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం:మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

నల్లగొండ జిల్లా:ఎన్నికల సమయంలో అడ్డగోడలుగా హామీలు ఇచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.నకిరేకల్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.

6 గ్యారంటీలో అరకొరగా అమలు చేసి, అసలు హామీలను ఆటకెక్కించారని విమర్శించారు.అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా పాలనలో అలసత్వం కనబడుతుందన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో నకిరేకల్ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి,రోడ్లు, స్మశాన వాటికలు వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు.గ్రామాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించారని,రైతులకు సమస్యలు లేకుండా చేశారని, ప్రస్తుత అధికార పార్టీ నాయకులు సమస్యలు సృష్టించి లక్షల రూపాయలు దంచుకుంటున్నారని ఆరోపించారు.

పోలీస్ స్టేషన్ల చుట్టూ రైతులు తిరగలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పేరిట బెదిరించి సంతకాల సేకరణ చేశారన్నారు.

Advertisement

చైర్మన్ విధులను ఆటంకం కలిగించి,అధికారులు చేతుల్లో పాలన లేకుండా విధులకు ఆటకం కలిగిస్తున్నారని,ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయాలని,ఇంటి దగ్గర కూర్చుని ఎవరికీ బిల్లు రాకుండా తీర్మానాలు చేస్తూ ఆటవిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.అవిశ్వాసాల పేరిట బెదిరింపుల పేరిట పోలీస్ స్టేషన్లో వేదిక పెట్టుకొని పరిపాలన సాగించడం ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్లు,సైదులు,వార్డు కౌన్సిలర్లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News