మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవే!

మన హిందూ సాంప్రదాయం ప్రకారం తెలుగు మాసాలలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది.అదేవిధంగా మే నెలలో కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

 Festivals And Vrats In The Month Of May 2021-TeluguStop.com

హిందూ క్యాలెండర్ ప్రకారం రెండో నెల వైశాఖ మాసం మే నెలలోనే ప్రారంభం అవుతుంది.ఈ నెలలో ఎన్నో ముఖ్యమైన పవిత్రమైన రోజులు ఉన్నాయి.

మే నెలలో ముఖ్యంగా అక్షయ తృతీయ, పరశురామ జయంతి, బుద్ధ పౌర్ణమి, వంటి పండుగలతో పాటు ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పండుగ కూడా ఈ మాసంలోనే వస్తుంది.ఈనెలలో హిందువులు, ముస్లింలు ఎంతో పవిత్రంగా ఉపవాసాలు చేసి పండుగను జరుపుకుంటారు.

 Festivals And Vrats In The Month Of May 2021-మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా మే 2021 మే మాసంలో ఏయే రోజుల్లో ఏయే పండుగలు ఏ రోజుల్లో రానున్నాయి.ఏ వ్రతాలు ఏ రోజున చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Telugu Festivals, Hindu Calendar, May Month, Ramjan-Telugu Bhakthi

మే 7వ తేదీ వరూధిని ఏకాదశి.ఈరోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి లక్ష్మీ నారాయణుని పాదాల వద్ద తెల్లని పువ్వులను ఉంచి పూజలు చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని కోరికలు నెరవేరుతాయని భావిస్తారు.మే 11న వైశాఖ అమావాస్య. పురాణాల ప్రకారం ఈ నెలలోనే త్రేతా యుగం ప్రారంభమైందని భావిస్తారు.మే 10వ తేదీనే ఈ అమావాస్య ప్రారంభం అవుతుంది.అమావాస్య రోజు కూడా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

మే 14 అక్షయ తృతీయ.దేశవ్యాప్తంగా ఈ పండుగను వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా నిర్వహించుకుంటారు.అక్షయ తృతీయ రోజు మహిళలు పెద్ద ఎత్తున బంగారు నగలను కొనుగోలు చేస్తారు.అదే విధంగా ఇతరులకు విలువైన వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తారు.

మే 21 సీతా నవమి, మే 22 మోహిని ఏకాదశి, మే 26 బుద్ధ పూర్ణిమ ముఖ్యమైన పండుగలను మే నెలలోనే జరుపుకుంటారు

#Festivals #May Month #Ramjan #Hindu Calendar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL