మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవే!

మన హిందూ సాంప్రదాయం ప్రకారం తెలుగు మాసాలలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది.

అదేవిధంగా మే నెలలో కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.హిందూ క్యాలెండర్ ప్రకారం రెండో నెల వైశాఖ మాసం మే నెలలోనే ప్రారంభం అవుతుంది.

ఈ నెలలో ఎన్నో ముఖ్యమైన పవిత్రమైన రోజులు ఉన్నాయి.మే నెలలో ముఖ్యంగా అక్షయ తృతీయ, పరశురామ జయంతి, బుద్ధ పౌర్ణమి, వంటి పండుగలతో పాటు ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పండుగ కూడా ఈ మాసంలోనే వస్తుంది.

ఈనెలలో హిందువులు, ముస్లింలు ఎంతో పవిత్రంగా ఉపవాసాలు చేసి పండుగను జరుపుకుంటారు.ఈ సందర్భంగా మే 2021 మే మాసంలో ఏయే రోజుల్లో ఏయే పండుగలు ఏ రోజుల్లో రానున్నాయి.

ఏ వ్రతాలు ఏ రోజున చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. """/" / మే 7వ తేదీ వరూధిని ఏకాదశి.

ఈరోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి లక్ష్మీ నారాయణుని పాదాల వద్ద తెల్లని పువ్వులను ఉంచి పూజలు చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని కోరికలు నెరవేరుతాయని భావిస్తారు.

మే 11న వైశాఖ అమావాస్య.పురాణాల ప్రకారం ఈ నెలలోనే త్రేతా యుగం ప్రారంభమైందని భావిస్తారు.

మే 10వ తేదీనే ఈ అమావాస్య ప్రారంభం అవుతుంది.అమావాస్య రోజు కూడా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

మే 14 అక్షయ తృతీయ.దేశవ్యాప్తంగా ఈ పండుగను వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా నిర్వహించుకుంటారు.

అక్షయ తృతీయ రోజు మహిళలు పెద్ద ఎత్తున బంగారు నగలను కొనుగోలు చేస్తారు.

అదే విధంగా ఇతరులకు విలువైన వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తారు.

మే 21 సీతా నవమి, మే 22 మోహిని ఏకాదశి, మే 26 బుద్ధ పూర్ణిమ ముఖ్యమైన పండుగలను మే నెలలోనే జరుపుకుంటారు.

ట్రైకోడెర్మా విరిడి తో పంటలకు ఆశించే తెగుళ్ళకు చెక్..!