విద్యుత్ షాక్ గురై రైతు మృతి

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం గర్నెకుంట శివారులో సోమవారం సాయంత్రం విద్యుత్ షాకుకు గురై చిట్టిమల్లె శ్రీను(40)( Chittimalle Srinu (40) )అనే రైతు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో పనిచేస్తుండగా బోరు పోయకపోవడంతో కొద్ది దూరంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయిందని గ్రహించి ఫీజు వేద్దామని ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి పైకి ఎక్కగా ట్రాన్స్ఫార్మర్ సరిగా ఆప్ కాకపోవడంతో విద్యుత్ షాకుతో క్రింద పడిపోయాడు.భార్య జయమ్మ గ్రహించి చికిత్స నిమిత్తం ఆటోలో పెద్దవూర తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు.

భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ యోగి తెలిపారు.మృతుడికి ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

Latest Nalgonda News