పవన్ కళ్యాణ్ సినిమా చూసి బయ్యర్లు నిద్రపోయారట.. ఆ సినిమా రిజల్ట్ ఏంటంటే?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.యావరేజ్ టాక్ వచ్చిన సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా స్థాయిలో కలెక్షన్లను సాధించే సత్తా పవన్ కళ్యాణ్ సొంతమని చెప్పవచ్చు.

 Famous Editor Marthand K Venkatesh Interesting Comments About Pawan Toliprema Mo-TeluguStop.com

పవన్ కళ్యాణ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో తొలిప్రేమ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.కరుణాకరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

1998 సంవత్సరంలో తొలిప్రేమ సినిమా విడుదల కాగా ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించారు.ఈ సినిమాలోని పాటలు ఊహించని స్థాయిలో హిట్టయ్యాయి.

ప్రముఖ టాలీవుడ్ ఎడిటర్లలో ఒకరైన మార్తాండ్ కె వెంకటేష్ తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.పవన్ కు డెడికేషన్ ఎక్కువని ఇతర హీరోల సినిమాల గురించి ఆయన పట్టించుకోరని మార్తాండ్ కె వెంకటేష్ తెలిపారు.

పవన్ ఒక ఫ్యామిలీ మెంబర్ లా మూవ్ అవుతారని ఏదైనా ఇబ్బందిలో ఉంటే పవన్ తన వంతు సహాయం చేస్తారని ఆయన అన్నారు.తొలిప్రేమ సినిమాకు తాను పని చేసినందుకు నాకు నంది అవార్డ్ వచ్చిందని మార్తాండ్ కె వెంకటేష్ తెలిపారు.

ఖుషి సినిమాకు సాంగ్స్, ఫైట్స్ పవన్ కంపోజ్ చేశారని మార్తాండ్ కె వెంకటేష్ తెలిపారు.తొలిప్రేమ సినిమా బాగుందని మేమంతా ఫీల్ అయ్యామని బయ్యర్లు మాత్రం ఆ సినిమా చూసే సమయంలో నిద్రపోయారని ఆయన అన్నారు.

ఒక బయ్యర్ డైరెక్టర్ ను పిలిచి సాంగ్స్ లో ఒక్క ఫిమేల్ వాయిస్ కూడా లేదని మీకు ఆడవాళ్లంటే ఇష్టం లేదా అని అడిగారని మార్తాండ్ కె వెంకటేష్ చెప్పుకొచ్చారు.ఎవరి జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదని తాను ఊహించిన విధంగా తొలిప్రేమ హిట్ అయిందని మార్తాండ్ కె వెంకటేష్ తెలిపారు.పవన్ ఫైట్స్ న్యాచురల్ ఫైట్స్ లా ఉంటాయని ఆయన అన్నారు.

Famous Editor Marthand K Venkatesh Interesting Comments About Pawan Toliprema Movie , Buyers, Interesting Facts, Marthand K Venkatesh, Pawan Kalyan, Toliprema - Telugu Buyers, Pawan Kalyan, Toliprema

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube