క్షుద్ర పూజలు మాటున బాలికపై దారుణం

ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.చుట్టూ ఉన్నవారినే కాకుండా సొంత మనుషులని కూడా నమ్మలేని పరిస్థితి నెలకొని ఉంది.

 Fake Swamiji Abuse Teenage Girl In Prakasam District, Andhra Pradesh, Lock Down,-TeluguStop.com

వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్ల అనిపిస్తే చాలు కోరిక తీర్చుకోవడానికి మృగాళ్ళు ఏ మాత్రం ఆలోచించడం లేదు.కనికరం లేకుండా అత్యాచారానికి పాల్పడుతున్నారు.

ఇప్పుడు ఇలాంటి ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేయాలని చెప్పి గుంటూరు జిల్లాకి చెందిన విష్ణువర్ధన్ అనే వ్యక్తి బాలికపై అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

దొనకొండ మండలంలోని రుద్రసముద్రానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో విష్ణువర్ధన్‌కు ఇటీవల పరిచయమైంది.

ఈ క్రమంలో గ్రామంలోని కొందరికి తాయెత్తులు కట్టేందుకు రావాలంటూ విష్ణువర్ధన్‌ను రామాంజనేయులు ఆహ్వానించాడు.

గ్రామానికి వచ్చిన విష్ణువర్ధన్‌కు ఓ ఇంటిలో బస ఏర్పాటు చేశారు.బస చేసిన ఇంటి యజమాని కుమార్తెపై కన్నేసిన విష్ణువర్ధన్ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మబలికాడు.

బాలికతో పూజలు చేయిస్తే వాటిని వెలికి తీయొచ్చని చెప్పాడు.నిజమేనని నమ్మిన ఇంటి యజమాని పూజలకు ఏర్పాటు చేశాడు.

గదిలోకి వెళ్లిన తర్వాత పూజల పేరుతో బాలికపై విష్ణువర్ధన్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.క్షుద్రపూజలు చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్థులు అతడిని నిలదీయడంతో బాలికపై అత్యాచార విషయం వెలుగుచూసింది.

తల్లిదండ్రులని నమ్మించి బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడికి దేహశుద్ది చేసిన గ్రామస్తులు అతడిని పోలీసులుకు అప్పగించారు.మనుషులలో గుప్తనిధులపై ఆశలు, మూఢ భక్తి ఎక్కువైతే ఎలాంటి సంఘటలు జరుగుతాయో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube