మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఇటీవల ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
కాగా ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా తరువాత చరణ్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అనే అంశం కూడా చాలా ఆసక్తికరంగా మారింది.
గతంలో చరణ్‌తో కలిసి ఎవడు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న వంశీ, తన నెక్ట్స్ మూవీని మహేష్ బాబుతో తెరకెక్కించేందుకు చాలా గ్యాప్ తీసుకున్నాడు.అయితే మహర్షి తరువాత వంశీతో సినిమా చేస్తానని చెప్పిన మహేష్, ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇచ్చాడు.
దీంతో వంశీ పైడిపల్లి తన నెక్ట్స్ సినిమాను మరోసారి చరణ్‌తో కలిసి తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.అయితే ఇప్పుడు చరణ్ కూడా వంశీకి హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.
దీనికి బలమైన కారణం ఉందనే చెప్పాలి.చరణ్‌కు అదిరిపోయే సక్సెస్‌ను ధృవ రూపంలో అందించి, మెగాస్టార్ చిరంజీవికి సైరా సినిమాను అందించిన సురేందర్ రెడ్డితో మరోసారి చరణ్ సినిమా చేయాలని చూస్తున్నాడట.
ఇప్పటికే చరణ్ కోసం ఓ పవర్ఫుల్ స్క్రిప్టును రెడీ చేసిన సురేందర్, త్వరలోనే దాన్ని చరణ్‌కు వినిపించాలని చూస్తున్నాడు.ఈ మేరకు చరణ్‌కు స్టోరీలైన్ కూడా వినిపించినట్లు తెలుస్తోంది.
ధృవ సక్సెస్‌తో సురేందర్ రెడ్డిపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్న చరణ్, ఈసారి తొలి ప్రాముఖ్యత అతడికే ఇవ్వాలని చూస్తున్నాడట.దీంతో వంశీ పైడిపల్లితో సినిమాపై మరోసారి డైలమా ఏర్పడింది.
మరి చరణ్ ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని ఎవరితో తెరకెక్కి్స్తాడా అనే ఆసక్తి మెగా ఫ్యాన్స్‌లో ఏర్పడింది.