పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యులు కావాలి: ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ నియోజకవర్గంలో భవిష్యత్తులో జరగబోయే పర్యావరణ మార్పులకు, కాలుష్య నియంత్రణకు ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మొక్కలను నాటి,వాటిని సంరక్షించాలని నిర్ణయించుకున్నామని,ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.

మంగళవారం నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా మహా తేజ రైస్ మిల్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లు అసోసియేషన్ వారు 250 మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మొక్కలు నాటారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు 20 వేల మొక్కలను నాటుతామని ముందుకు వచ్చారని, అందులో భాగంగా ప్రతీ రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలను నాటడం జరుగుతుందన్నారు.అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కుల, మత,వర్గ,పార్టీ విబేధాలు లేకుండా ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులై మొక్కలు నాటి భవిష్యత్తులో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కాలుష్య రహిత నియోజకవర్గంగా తీర్చిధిద్ధాలన్నారు.

Everyone Should Be A Partner In Environmental Protection MLA Battula Lakshmaredd

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,మిల్లర్స్ అసిడియేషన్ వారు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

Latest Nalgonda News