ఉద్యోగం కోసమో, వ్యాపార లేదా విద్యా ఇలా ఏ కారణం చేతనో విదేశాలు వలసలు వెళ్ళే వారు తప్పనిసరిగా ఆయా దేశాలలో అమలయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి లేదంటే జరగరాని తప్పు జరిగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.తెలిసి జరిగినా, యాదృశ్చికంగా జరిగినా అక్కడ అలాంటివేమి పట్టించుకోరు.
ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న భారతీయుడికి ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది.అయితే అతడు చేయకూడని తప్పే చేశాడు ఫలితం అనుభవిస్తున్నాడు.
వివరాలలోకి వెళ్తే.
దుబాయ్ లో ట్రాఫిక్ రూల్స్ పాటించక పోయినా, తాగి వాహనం నడిపినా సరే కటినమైన శిక్షలు అమలు చేస్తారు ఈ నేరాలలో అసలు రాజీ పడరు.
అయితే దుబాయ్ లో ఎన్నో ఏళ్ళ నుంచీ ఉంటున్న భారత్ కు చెందిన ఓ వ్యక్తి ఫుల్ గా తాగేసి వాహనం నడుపుతున్నాడు.ఈ క్రమంలో తన రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న కారును మద్యం మత్తులో డీ కొట్టాడు.
ఈ ఘటనతో షాక్ అయిన వ్యక్తీ వెంటనే అక్కడి నుంచీ తప్పించుకున్నాడు.కాసేపటి తరువాత డీ కొట్టబడిన వాహనం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆ ప్రాంతంలోని సిసి టీవీ పుటేజ్ ను పరిశీలించిన అధికారులు కొన్ని గంటల వ్యవధిలోనే కారును డీ కొట్టి పారి పోయిన భారతీయుడిని గుర్తించి పట్టుకున్నారు.అనంతరం అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా దుబాయ్ కోర్టు తాగి వాహనం నడిపి యాక్సిడెంట్ చేసినందుకు గాను అతడికి దుబాయ్ కరెన్సీ ప్రకారం 25 వేల దిర్హమ్స్ జరిమానా విధించింది అంటే భారత కరెన్సీలో రూ.5,56,000.ఇదిలాఉంటే అతడు రెండు రోజుల తరువాత బెయిల్ పై విడుదలయ్యి వెళ్లిపోయాడని, అయితే అతడు చేసిన నేరానికి జైలు జీవితంతో పాటు, రెండు ఏళ్ళ పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి , రెండు నెలల పాటు వాహనాన్ని సీజ్ చేస్తారు.