కేతేపల్లి మండలంలో 24 కేజీల గంజాయి పట్టివేత:డిఎస్పీ శివరాంరెడ్డి

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహడ్ వద్ద శనివారం కేతేపల్లి ఎస్ఐ శివతేజ అధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు యువతులు,ఒక యువకుడు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకునోని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిసిందని నల్లగొండ డిఎస్పీ శివరాంరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

వీరు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వీరు 6 వేల రూపాయలు తీసుకోని గంజాయిని ముంబైకి సప్లై చేస్తున్నారని తెలిపారు.

వీరి వద్ద నుండి సుమారు 6 లక్షలు విలువ చేసే 24 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని,కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.

వావ్, ఆటోను మినీ లైబ్రరీగా మార్చేసిన డ్రైవర్.. బుక్స్ ఫ్రీగా తీసుకోవచ్చట..

Latest Nalgonda News