చట్టపరమైన భద్రత లేకనే బీసీ సామాజిక వర్గాలపై దాడులు: పాలకూరి రవి

నల్లగొండ జిల్లా:చట్టపరమైన భద్రత లేని కారణంచేత బీసీ సామాజిక వర్గాలపై నిత్యం దాడులు జరుగుతున్నాయని నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థులు పాలకూరి రవి, పాలకూరి రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాలకు చట్టపరమైన భద్రత లేని కారణం చేత కులంపేరుతో దూషిస్తూ,భౌతిక దాడులకు పాల్పడుతున్నారని,ఇలాంటి భౌతిక దాడులను అరికట్టాలంటే బీసీ సామాజిక వర్గాలలో చైతన్యం రావాలని కోరారు.

 Attacks On Bc Social Groups Without Legal Protection Palakuri Ravi , Palakuri Ra-TeluguStop.com

మన ఓటు మనం వేసుకుంటేనే పార్లమెంట్లో మన గొంతు వినిపిస్తుందని నల్గొండ పార్లమెంటు నుండి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలబడడం జరిగిందన్నారు.వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గాలను జెండాలు మోయిస్తూ తమ దగ్గర బానిసల్లాగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నించిన కార్యకర్తలపై కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడులకు పాల్పడడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి గడగోజు విజయ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దొరేపల్లి హరిశంకర్,పట్టణ అధ్యక్షుడు బత్తుల శ్రీశైలం యాదవ్, మాదగోని శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube