ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి చనిపోయినట్లు నాటకం ఆడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా( East Godavari District )లో చోటు చేసుకుంది.రంగంపేట మండలం వీరంపాలెంకు చెందిన వెంకటేశ్వర రావు అలియాస్ పూసయ్య ధాన్యం వ్యాపారాన్ని చేస్తుంటాడు.
రెండు నెలల క్రితం తన పేరు మీద పూసయ్య బీమా ( pusayya )చేయించుకున్నాడు.ఈ క్రమంలోనే అప్పుల పాలు కావడంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం( Insurance money ) కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టాడు.మరో ఇద్దరి సాయంతో తానే చనిపోయినట్లు నాటకం ఆడాడు.గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని తీసుకొచ్చి పూసయ్య చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.పూసయ్య మృతిపై పోలీసులు ( Police )చేపట్టిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.పూసయ్య మోసం చేసేందుకు ప్రయత్నించాడని గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.