ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్లు డ్రామా..తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
TeluguStop.com
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి చనిపోయినట్లు నాటకం ఆడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా( East Godavari District )లో చోటు చేసుకుంది.
రంగంపేట మండలం వీరంపాలెంకు చెందిన వెంకటేశ్వర రావు అలియాస్ పూసయ్య ధాన్యం వ్యాపారాన్ని చేస్తుంటాడు.
"""/" /
రెండు నెలల క్రితం తన పేరు మీద పూసయ్య బీమా ( Pusayya )చేయించుకున్నాడు.
ఈ క్రమంలోనే అప్పుల పాలు కావడంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం( Insurance Money ) కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టాడు.
మరో ఇద్దరి సాయంతో తానే చనిపోయినట్లు నాటకం ఆడాడు.గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని తీసుకొచ్చి పూసయ్య చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.
పూసయ్య మృతిపై పోలీసులు ( Police )చేపట్టిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పూసయ్య మోసం చేసేందుకు ప్రయత్నించాడని గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
ఢిల్లీ రోడ్లపై చక్కర్లు కొడుతున్న దెయ్యాల ఆటో.. వీడియో చూస్తే గుండెలు అదిరిపోతాయి!