రథసప్తమి రోజున.. జిల్లేడు ఆకుతో స్నానం ఎందుకు చేస్తారో తెలుసా..?

జగతికి ప్రత్యక్ష దైవం సూర్యుడు.సృష్టికారకుడైన సవితగానూ, స్థితికారకుడైన మిత్రునిగానూ, మృత్యుకారకుడైన మార్తాండునిగానూ ఈ విశ్వంలో ఆయన వెలుగొందుతున్నాడు.

 Do You Know Why We Bath With Calotropis Leave On Rathasapthami , Devotional , Jilledu Aakulu , Ratha Sapthami , Ratha Sapthami Special , Telugu Devotional , Sun Worship , District Tree Solar , Archives-TeluguStop.com

మాఘ మాసం శుక్లపక్షం సప్తమి తిథి ‘రథ సప్తమి’గా ప్రసిద్ధం.సూర్యరథం దక్షిణాయనం ముగించి, పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

రధసప్తమి రోజు జిల్లేడు ఆకులు శరీరం పైన ధరించి తలస్నానం చేసి సూర్యారాధన చేస్తారు ఎందుకో తెలుసా. జిల్లేడు చెట్టు సూర్యశక్తిని అత్యధికంగా గ్రహిస్తుంది.

 Do You Know Why We Bath With Calotropis Leave On Rathasapthami , Devotional , JILLEDU AAKULU , RATHA SAPTHAMI , RATHA SAPTHAMI SPECIAL , Telugu Devotional , Sun Worship , District Tree Solar , Archives-రథసప్తమి రోజున.. జిల్లేడు ఆకుతో స్నానం ఎందుకు చేస్తారో తెలుసా..-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ చెట్టు ఆకులను అర్కపత్రాలు అంటారు.ఈ ఆకులను తలపై, శరీరంపై ధరించి స్నానం చేయడం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది.

అంతే కాకుండా శరీరంలోని టాక్సిన్స్ లాగేసుకుంటాయి.ఆకు రసాయనాలు జుట్టును బిగిస్తాయి.

మెదడును చల్లబరుస్తుంది.

దీనిని ఆంగ్లలో బెలడోనా అంటారు.మంగలులు వ్రణాలను నయం చేయడానికి అర్కచెట్టు నుంచి వచ్చే పాలతో నల్లటి జిగురు పదార్ధాన్ని తయారుచేసి అది ఒక గుడ్డమీద పూసి వ్రణాలకు అంటించే వారు.ఈ ప్రక్రియలను చిల్లుల పలాస్త్రి అనేవారు.

కాస్త వేడి చేసి వ్రణాలపైన అంటింస్తే నెప్పి,వాపు, తగ్గించడంతో పాటు దానిలోని బాక్టీరియాను చంపుతుంది.ఇంత విజ్ఞానాన్ని మన పూర్వులు మనకు ఆచారాల రూపంలో అందిస్తే మనం దానిని తృణీకరించి, ఆధునికులమన్న పేరుతో ఆత్మవంచన చేసుకుంటున్నాము.

మన ఆచారాలు సంప్రదాయాలు వైజ్ఞానిక దృష్టితో ఏర్పరచబడ్డాయి.వాటిని ఆచరిస్తూ అనుసరిస్తూ మన ముందు తరాలకు అందిచవలసిన గురుతర బాధ్యత మనపైన ఎంతైనా ఉందని మరచి పోవద్దు.

Do You Know Why We Bath With Calotropis Leave On Rathasapthami , Devotional , JILLEDU AAKULU , RATHA SAPTHAMI , RATHA SAPTHAMI SPECIAL , Telugu Devotional , Sun Worship , District Tree Solar , Archives - Telugu Devotional, Tree Solar, Jilledu Aakulu, Ratha Sapthami, Sun Worship

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube