యుద్ధం ఆపమంటూ లైవ్ లోనే ఆ లేడీ జర్నలిస్ట్ ఏం చేసిందో తెలుసా..

ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది.ఉక్రెయిన్ చిన్న దేశమైనా కానీ రష్యా మాత్రం తన శక్తినంతా ఉపయోగిస్తూ విరుచుకుపడుతోంది.

 Do You Know What That Lady Journalist Did Live To Stop The War War, Russia, Jou-TeluguStop.com

రష్యా ముప్పేట చేస్తున్న దాడితో ఉక్రెయిన్ దేశంలోని చాలా మంది పౌరులు విలవిలలాడిపోతున్నారు.ఎలాగైనా సరే ప్రాణాలు కాపాడుకోవాలని భావించి వేరే దేశాలకు వలస వెళ్తున్నారు.

ఇలా వలసలు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ఈ వలసల మీద ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళనలు వ్యక్తం చేసింది.

అయినా కానీ రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ప్రపంచవ్యాప్తంగా చాలా గ్లోబల్ సంస్థలు మరియు అనేక పాశ్చాత్య దేశాలు రష్యా మీద కఠిన ఆంక్షలు విధించాయి.

అయినా కానీ ఆ దేశం మాత్రం వెనకడుగు వేయడం లేదు.చాలా మంది రష్యన్లే యుద్ధం ఆపాలని దేశానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.

ఇలా యుద్ధం ఆపాలని నిరసనలు చేసే వారిని ప్రభుత్వం అణిచివేస్తుంది.ఇలానే ఒక లేడీ జర్నలిస్ట్ కూడా యుద్ధం ఆపాలని వినతి చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించింది.

ఈ లేడీ జర్నలిస్ట్ టీవీ షో లైవ్ నడుస్తుండగానే.తన నిరసనను తెలియజేసింది.

దీంతో రష్యా ప్రభుత్వం ఒక్కసారిగా అవాక్కయింది.

మాస్కోలోని ఓ న్యూస్ చానెల్​ లో పని చేస్తున్న ఓవ్య్సానికోవా అనే మహిళా జర్నలిస్ట్ యుద్ధం ఆపాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది.

అధికార యంత్రాంగానికి అనేక విజ్ఞప్తులు కూడా చేసింది.అయినా కానీ ఆ మహిళ వినతిని అక్కడి అధికార యంత్రాంగం పట్టించుకోలేదు.దీంతో ఓవ్య్సానికోవా లైవ్ లోనే తన నిరసనను తెలియజేయాలని నిర్ణయించుకుంది.అనుకున్నదే తడవుగా తన ప్లాన్ ను అమలు చేసింది.

సహచర జర్నలిస్ట్ లైవ్ లో వార్తలు చదువుతుండగా.యుద్ధం ఆపాలని ప్లకార్డును ప్రదర్శిస్తూ తన నిరసనను తెలియజేసింది.

దీంతో అవాక్కయిన ప్రభుత్వ యంత్రాంగం సదరు జర్నలిస్ట్​ ను వెంటనే అదుపులోకి తీసుకుంది.ఆ జర్నలిస్టుకు దాదాపు 15 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube