ఈ మధ్య కాలంలో వస్తున్న కొత్త దర్శకులు, హీరోలు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న జాడ్యాన్ని తొలగిస్తున్నారు.మా అభిమాన హీరో ఎలా ఉండాలి, ఎలాంటి సినిమా చేయాలి అని డిసైడ్ చేసేది అభిమానులే.
ఎందుకంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే సినిమాలు వసూళ్లు( Movie Collections ) సాధించడం లేదు.బారి కమర్షియల్ హంగులతో సినిమాలు తీయాలని అభిమానులు తమ అభిమాన హీరోను అంత ఎత్తున చూడాలని కోరుకుంటున్నారు.
అందుకు తగ్గట్టుగా సినిమాలు లేకపోతే ఫ్యాన్స్( Fans ) డిసప్పాయింట్ అయిపోతున్నారు.ఇక ఇలాంటి కొన్ని సున్నితమైన అంశాలపై ఇటీవలే దర్శకుడు మరియు హీరో అయినా తరుణ్ భాస్కర్( Tharun Bhaskar ) స్పదించాడు.
తాము ప్రస్తుతం ఆడిషన్స్ చేస్తున్న నటులు( Actors ) ఎవ్వరు కూడా మార్కెట్ లో తెలియని వారే, వారితో సినిమా తీస్తే మార్కెట్ రావడం చాల కష్టం.అయినా కూడా ఆ హీరోతోనే సినిమా చేసి అది అమ్మడానికి కుక్క చావు చస్తున్నాం.అది కాదు అని మార్కెట్ ఉన్న స్టార్ హీరో ని పెట్టుకుంటే వారు కొన్ని సీన్స్ చేయడానికి ఒప్పుకోరు.అలాగే వారితో సినిమా చేయాలంటే ఫ్యాన్స్ కి తగ్గట్టుగా కథ మార్చాలి.
అలాగే భిన్నమైన కథ( Movie Story ) రాసినప్పుడు కొత్త వారైతేనే సాధ్యపడుతుంది.అందుకే అభిమానులు కూడా మారాలి.
ఈ మధ్య కాలంలో సినిమాలు మారుతున్నాయి, కథలు మారుతున్నాయి , సినిమా పోకడ మారుతుంది.అలాంటప్పుడు అభిమానులు కూడా మారితేనే సినిమా మంచిగా బయటకు వస్తుంది.
మా హీరో ఇలాగే ఉండాలి అనే బ్రాంతి నుంచి బయటకు రావాలి.కొన్ని సార్లు హీరోలు మారడానికి ముందుకు వచ్చిన కూడా ఫ్యాన్స్ మాత్రం ఆ మార్పును ఆహ్యానించడం లేదు అంటూ తరుణ్ భాస్కర్ తన మనసులోని మాటలను బయట పెట్టారు.ఇది తరుణ్ భాస్కర్ యొక్క ఆవేదన మాత్రమే కాదు.చాల మంది తెలుగు దర్శకులు( Tollywood Directors ) కొత్త వారితోనే సినిమాలు తీయడానికి ఇది ఒక ముఖ్య కారణం అయితే కొత్త దర్శకులను పెద్ద హీరోలు అంత తొందరగా ఒప్పుకోకపోవడం కూడా మరొక కారణం.
ఏది ఏమైనా ఇప్పుడు ఫాన్స్ కి మారాల్సిన టైం వచ్చింది.