ప్రముఖ టాలీవుడ్ నటి పూర్ణ, రవిబాబు( Actress Poorna, Ravi Babu ) కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.తాజాగా ఈ కాంబినేషన్ లో అసలు అనే సినిమా తెరకెక్కగా ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవిబాబు మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
అయితే రవిబాబు తన సినిమాలలో పూర్ణకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడంతో రవిబాబు, పూర్ణ మధ్య ఏదో ఉందని కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఈ వార్తల గురించి రవిబాబు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.నటి పూర్ణతో తనకు లవ్ ఎఫైర్ ఉందని ఆయన కామెంట్లు చేశారు.లవ్ ఎఫైర్ ఉందని చెప్పినంత మాత్రాన మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవద్దని రవిబాబు చెప్పుకొచ్చారు.
ప్రతి డైరెక్టర్ కు తమ సినిమాలలో నటించే వాళ్లతో అలాంటి అనుబంధమే ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు.డైరెక్టర్ చెప్పిన దానితో పోల్చి చూస్తే పూర్ణ 200 శాతం యాడ్ చేసి నటిస్తుందని రవిబాబు చెప్పుకొచ్చారు.నా సినిమాలో హీరోయిన్ ను ఎంపిక చేయాలని భావిస్తే మొదట పూర్ణ గుర్తొస్తుందని ఆయన తెలిపారు.అయితే పూర్ణ అన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదని రవిబాబు అన్నారు.
వాషింగ్ మెషీన్ అనే మూవీ కోసం పూర్ణను సంప్రదించగా ఆమె వెంటనే ఆ సినిమాకు నో చెప్పడం జరిగిందని రవిబాబు కామెంట్లు చేశారు.నాకోసం ఆమె స్పెషల్ గా ఒప్పుకోదని అలా ఒప్పుకోకూడదని రవిబాబు వెల్లడించారు.అ అనే అక్షరంతో రవిబాబు ఎక్కువగా సినిమాలను తెరకెక్కించారు.ఇతర డైరెక్టర్లకు భిన్నమైన కథలను రవిబాబు ఎంచుకుంటున్నారు.