దర్శకేంద్రుడి లవ్‌స్టోరీ!!

వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను ఏర్పర్చుకున్న దర్శకుడు దర్శకేంరదుడు రాఘవేంద్ర రావు.ఈయన ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు.

 Director Raghavendra Rao Comes With New Love Story-TeluguStop.com

అయితే ఈయన గత కొంత కాలంగా సక్సెస్‌లను సాధించలేక పోతున్నాడు.ఈయన చివరగా దర్శకత్వం వహించిన ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమా విడుదలకే నోచుకోలేదు.

అయినా కూడా రాఘవేంద్ర రావు అంటే టాలీవుడ్‌లో ఒక బ్రాండ్‌.ఆయన నుండి సినిమా అంటే ఖచ్చితంగా సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉంటాయి.

ఇటీవలే నాగార్జున హీరోగా ఒక భక్తిరస చిత్రంను రాఘవేంద్ర రావు తెరకెక్కించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.అయితే ఆ సినిమా కంటే ముందు ఒక ప్రేమ కథా చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలను రాఘవేంద్ర రావు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నట్లుగా కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.రాజ్‌ తరుణ్‌తో రాఘవేంద్ర రావు ప్రేమ కథను తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇటీవలే రాజ్‌ తరుణ్‌తో రాఘవేంద్రరావు సన్నిహితులు సన్నిహితులు చర్చలు జరిపినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.ఇదే సంవత్సరంలో ఈ సినిమా ప్రారంభం అయ్యి, వచ్చే సంవత్సరం ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube