నలుగురు తాగుబోతులతో ప్రగతి భవన్ నుంచి డైరెక్షన్

నల్లగొండ జిల్లా:బుధవారం మొయినాబాద్ ఫామ్ హౌస్ కథ, స్క్రీన్ ప్లే,నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారం కామెడీ సీన్ లాగా ఉందని,అంతా డ్రామాయేనని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ నలుగురు సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలని,వాళ్లకు అంత రేటు ఉంటుందా? అని ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఒక్కరూ గెలిచే వాళ్ళు కాదన్నారు.

నిన్నటి డ్రామాను ప్రజలు కాసేపు నవ్వుకున్నారన్నారు.నలుగురు తాగుబోతులను పెట్టి ప్రగతి భవన్ నుంచి డైరెక్షన్ ఇచ్చారని తెలిపారు.దేశ వ్యాప్తంగా ఇచ్చిన తీర్పు మునుగోడులో ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Direction From Pragathi Bhavan With Four Drunkards-నలుగురు తా�

బీజేపీ దక్షిణ తెలంగాణలో రోజురోజుకు విజృంభిస్తోందని కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదన్నారు.దేశంలో ఎక్కడా సిట్టింగ్ పార్టీ ఎమ్మెల్యేను బీజేపీ తీసుకోలేదన్నారు.

బీజేపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేశాక గెలుస్తారనే నమ్మకం ఉంటేనే పార్టీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Latest Nalgonda News