మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్న సమయం లో వరుసగా నాలుగైదు సినిమా లకు కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి.అందులో వెంకీ కుడుముల దర్శకత్వం లో సినిమా కూడా ఒకటి మెగా స్టార్ చిరంజీవి కోసం వెంకీ కుడుముల రెడీ చేసిన కథ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంది అంటూ వార్తలు వచ్చాయి.
ముఖ్యంగా చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్లుగా మాస్ పాత్ర మీ వెంకీ రాసుకో వచ్చాడట.దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వెంటనే ఉంటుందని అంత భావించారు.
కానీ ఇప్పటి వరకు ఆ సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేక పోవడంతో ఇంతకి ఆ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
అందుకే చిరంజీవి తదుపరి సినిమా ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అందులో భాగంగానే వెంకీ కుడుముల దర్శకత్వం లో సినిమా ను పక్కకు పెట్టాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికైతే బాబీ దర్శకత్వం లో వాల్తేరు వీరయ్య సినిమా ను చిరంజీవి చేస్తున్నాడు.అంతే కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వం లో భోళా శంకర్ సినిమా ను కూడా చిరంజీవి చేస్తున్నాడు.ఈ రెండు సినిమాల తర్వాత అప్పుడు వెంకీ కుటుంబం లో దర్శకత్వం లో సినిమా గురించి చిరంజీవి ఆలోచించే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
కేవలం వెంకీ కుడుముల దర్శకత్వం లోని సినిమా మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గతం లో యువ దర్శకుడు సందీప్ వంగా ఇంకా మరి కొందరు దర్శకులకు కూడా సినిమా చేద్దామంటూ హామీ ఇచ్చాడట.దాంతో వారు కూడా స్క్రిప్టు పట్టుకొని చిరంజీవి చుట్టూ తిరుగుతున్నారు.
త్వరలోనే చిరంజీవి కలిసి ఫైనల్ స్క్రిప్ట్ వినిపించాలని వారు కోరుకుంటున్నారు.చిరంజీవి డేట్ లో ఇస్తాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ దక్కించుకున్నాడు.దాంతో మళ్లీ ఆయన స్పీడ్ పెంచాలని ఉద్దేశం తో ఉన్నాడని.
కనుక యంగ్ దర్శకులతో స్పీడ్ స్పీడ్ గా సినిమా లు చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటూ మెగా కాంపౌండ్ నుండి సమాచారం వినిపిస్తోంది.