కాంగ్రెస్ హయాంలోనే గ్రామాలాభివృద్ధి:ఎమ్మెల్యే బాలూనాయక్

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ పార్టీ హయంలోనే గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్( Balu Naik ) అన్నారు.

నల్లగొండ జిల్లా( Nalgonda District ) చింతపల్లి మండలంలోని వెంకటపేట గ్రామంలో అండర్ డ్రైనేజీ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా గ్రామానికి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ( Congress party )ప్రభుత్వంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామాలలో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా కల్పించారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తామని,గెలిచిన రెండు నెలలు కాకముందే ప్రతిపక్ష పార్టీలు తమ పాలన చూసి ఓర్వడం లేదని,ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా కూడా మార్పు రాలేదని,ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుందని, దానికి మొన్న వచ్చిన ఫలితాలే నిదర్శనమని అన్నారు.

ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎంపీపీ భవాని, ఎంపీడీవో సుజాత,మాజీ సర్పంచ్ కాగిత జితేందర్ రెడ్డి( Jitender Reddy ),జీవన్ సింగ్,ప్రత్యేక ఆఫీసర్ గోవిందరెడ్డి, పంచాయతీ కార్యదర్శి అశోక్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్,మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణ్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News