అనిక సురేంద్రన్( Anika Surendran ).తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ ఆమె ఫొటో చూస్తే మాత్రం గుర్తుపట్టేస్తారు.
ఈమె అజిత్ కుమార్ ( Ajith Kumar )హీరోగా నటించిన తమిళ చిత్రం విశ్వాసం మూవీలో ఆయన కూతురిగా నటించిన విషయం తెలిసిందే.ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన ది గోస్ట్ సినిమాలో కూడా నటించి మెప్పించింది.
ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.తరచూ అభిమానులతో ముచ్చటించడంతో పాటు వరుస గ్లామర్ ఫోటో షూట్స్ తో యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
కాగా మొదట ఈమె 2007లో చోటా ముంబై అనే ఒక మాలీవుడ్ సినిమా ( Mollywood movie )ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.మనే ఐందాల్, విశ్వాసం వంటి సినిమాల్లో అజిత్ కూతురిగా నటించి పాపులర్ అయింది.ఆ తర్వాత పుట్టబొమ్మ, ఓ మై డార్లింగ్ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.అయితే ఈ చిత్రాలు మిక్స్‌డ్ రివ్యూలు అందుకోగా కెరీర్ అనుకున్నంత సాఫీగా కొనసాగట్లేదు.
కానీ యాడ్స్, సోషల్ మీడియా ద్వారా మాత్రం భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఏడాదికి రూ.3 కోట్ల వరకు సంపాదిస్తున్న ఈ బ్యూటీ ఇప్పటి వరకు రూ.16కోట్ల వరకు కూడబెట్టిందని సమాచారం.ఇక తెలుగులోనూ బుట్టబొమ్మ సినిమాతో డెబ్యూ అయిన అనిక.అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈమె సోషల్ మీడియాలో వరుసగా గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ యువతకు కంటి మీదకు లేకుండా చేస్తోంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.