Magunta Sreenivasulu Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాం ఎఫెక్ట్ : ‘ మాగుంట ‘ కు టీడీపీ టికెట్ లేనట్టేనా ?

టీడీపీ, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు చేపట్టాయి.ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు టిడిపి, జనసేన అభ్యర్థులను ప్రకటించింది.ఇంకా కొన్ని సీట్ల విషయంలో పెండింగ్ లో పెట్టింది.25 లోక్ సభ స్థానాలకు గాను 17 స్థానాల్లో టిడిపి రెండు స్థానాల్లో జనసేన, ఆరు స్థానాల్లో బిజెపి పోటీ చేయబోతున్నాయి.టిడిపి 13 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించింది.ఇక మిగతా నాలుగు స్థానాల విషయంలో అభ్యర్థుల విషయంలో సరైన క్లారిటీ రాకపోవడంతో, వాటిని పెండింగ్ లో పెట్టారు.

 Delhi Liquor Scam Effect Magunta Doesnt Have Tdp Ticket-TeluguStop.com

అందులో ప్రధానంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిని ప్రకటించ లేదు.ఇక్కడ వైసిపి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగంటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పేయడంతో, అసంతృప్తికి గురై కొద్దిరోజుల క్రితమే టిడిపిలో చేరారు.

ఎంపీ సీటును తన కుమారుడు రాఘవరెడ్డి( Magunta raghavareddy )కి కేటాయించాలని ముందుగానే చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్నారు.అయితే శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జైలుకు వెళ్లొచ్చారు.

ఆ తరువాత అప్రూవర్ గా మారి బయటకు వచ్చారు.

Telugu Amith Sha, Ap, Arvind Kejriwal, Delhi Cm, Jagan, Janansena, Ongole Mp-Pol

ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కూడా అరెస్ట్ అయ్యారు.వీరిద్దరి రిమాండ్ రిపోర్ట్ లో రాఘవరెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.దీంతో ఈ కేసులో సంబంధం ఉన్న మాగుంట కుటుంబానికి టికెట్ కేటాయించొద్దని చంద్రబాబుకు బిజెపి అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ కుమార్తె కవిత రాఘవరెడ్డి నుంచి 30 కోట్లు వసూలు చేసి ఆప్ నేతలకు అందజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Telugu Amith Sha, Ap, Arvind Kejriwal, Delhi Cm, Jagan, Janansena, Ongole Mp-Pol

ఈ కారణంతోనే వైసిపి మాగుంట కుటుంబాన్ని పక్కన పెట్టగా, చంద్రబాబు మాత్రం పార్టీలో చేర్చుకున్నారు.ఇప్పుడు టికెట్ విషయంలో బిజెపి అధిష్టానం నుంచి ఒత్తిడి ఉండడం తో ఒంగోలు స్థానాన్ని పెండింగ్ లో పెట్టారు.దీంతో మాగుంట కుటుంబానికి ఎంపీ సీటు దక్కడం అనుమానం గానే మారింది.

అసలు వైసీపీలో టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతోనే ఆ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరిన మాగుంట కుటుంబానికి ఇక్కడా అదే పరిస్థితి ఏర్పడడంతో మాగుంట కుటుంబ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube