ప్రజాపాలన దరఖాస్తుల గడువు నెల రోజులు పొడిగించాలి:సీపీఎం

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాలకు ( Six Guarantee Schemes )దరఖాస్తు గడువు తేదీని ఈనెల 28 నుండి జనవరి 6 తేదీ వరకు మాత్రమే నిర్ణయించడం సరికాదని, నెలరోజుల గడవు పొడిగించాలని సిపిఎం( CPM ) జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను,మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ ప్రభుత్వాన్ని కోరారు.

గురువారం నల్లగొండ జిల్లా( Nalgonda District ) నిడమనూరు మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ పేదలకు కావలసిన ఆరు గ్యారెంటీలకు నిర్ణీత గడువు ప్రకటించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దరఖాస్తు ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించాలని కోరారు.

రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలకు అందే విధంగా చూడాలని, ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంటున్నప్పటికి అధికారులు మాత్రం ఈనెల 28 నుండి జనవరి 6 తారీకు వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయని చెప్పడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందన్నారు.మేజర్ గ్రామపంచాయతీలకు ఒకరోజు సాధ్యం కాదని, దరఖాస్తు స్వీకరణకు నెల రోజులు సమయం ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కోమండ్ల గురవయ్య, కుంచం శేఖర్,కోదండ చరణ్ రాజు,ముత్యాల కేశవులు తదితరులు పాల్గొన్నారు.

అద్భుతం, అడవి జంతువుకు దైవభక్తా.. శివలింగాన్ని హత్తుకున్న ఎలుగుబంటి వీడియో వైరల్!
Advertisement

Latest Nalgonda News