పొగమంచుతో పొంచి ఉన్న ప్రమాదం...!

నల్లగొండ జిల్లా:ఎంతో ప్రశాంతంగా ఉత్సాహాన్ని ప్రసాదించు శుభోదయం వేళ కమ్ముకుంటున్న భారీ పొగమంచు ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసి ప్రమాద ఘంటికలు మోగిస్తుంది.


ఉదయం 9 గంటల వరకు పొగమంచు భారీగా కురుస్తుండడంతో పొద్దున్నే వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు, వివిధ పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు, వృత్తి,ఉద్యోగ,ఉపాధ్యాయ,వ్యాపారస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

వాహనదారులకు దారి కనిపించకుండా మంచు కురుస్తుంది.దట్టమైన పొగమంచు( Fog ) కారణంగావాహనాల హెడ్ లైట్స్ వేసుకొని వచ్చినా కనిపించక ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ప్రయాణం చేయాలన్నా, రోడ్డు దాటాలంటే వెన్నులో వణుకుపుడుతుందని పలువురు వాపోతున్నారు.

ఇదిలా ఉంటే నిత్యం జాగింగ్ కు వెళ్లేవారు కూడా ఇంటికే పరిమితమైతున్నారు.

తిప్పర్తిలో జూ.కళాశాల స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Advertisement

Latest Nalgonda News