డి-40కాలువచివరిభూములకు నీరందించాలి: సీపీఎం నేత ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:ఉదయ సముద్రం డీ-40 కాలువ ( D-40 canal)ద్వారా చివరి భూములకు నీరందించాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

బుధవారం మాడ్గులపల్లి మండల కేంద్రంలో సీపీఎం మండల సీనియర్ నాయకులు దేవిరెడ్డి అశోక్ రెడ్డి అ( Devi Reddy Ashok Reddy A)ధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీ-40 కాలువ ద్వారా సర్వారం, గుర్రప్పగూడెం,గణపతివారిగూడెం,బొమ్మకల్లు గ్రామాల మీదుగా చివరి భూములకు నీటిని అందించాలన్నారు.

చివరి వరకు నీటిని విడుదల చేయకపోవడం వల్ల రైతులకు తీవ్రంగా నష్టం చేకూరుతుందన్నారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండి 3 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు నీటిని పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం పాలకుల,ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యధోరణికి నిదర్శనమన్నారు.

D-40 Canals Should Be Irrigated: CPM Leader Mudireddy Sudhakar Reddy ,D-40 Cana

చివరి భూముల వరకు నీటిని అందించకపోతే రైతులను ఐక్యం చేసి సీపీఎం,రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్,సహాయ కార్యదర్శి పుల్లెంల శ్రీకర్, మండల కమిటీ సభ్యులు బొమ్మకంటి అంజయ్య, తంగెళ్ళనాగమణి,పతానిశ్రీను,జూకూరి నాగయ్య, ఊరుగొండ శ్రీను,గడగోజు వెంకటాచారి,ఐతగోని విష్ణు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : ఎమ్మెల్యే వేముల
Advertisement

Latest Nalgonda News