తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే ముందుగా నందమూరి బాలయ్య బాబు పేరు అందరికీ గుర్తొస్తుంది.తన కంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నింటి వైవిధ్యమైన కథాంశాలతో తెరకెక్కడమే కాకుండా ఆయన చేసే సినిమాలన్ని ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాయి.
ఇక ప్రస్తుతం ఆయన అఖండ 2( Akhanda 2 ) సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.ఇక బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉన్నప్పటికీ ఇప్పటికే ఆయన బోయపాటితో చేస్తున్న అఖండ 2 సినిమా ముహూర్తం కూడా ఈరోజు జరిపించారు.మరి మొత్తానికైతే ఈ ముహూర్తం లో బాలయ్య బాబు చెప్పిన డైలాగు ప్రస్తుతం యావత్ తెలుగు ప్రేక్షకులందరిని ఊపేస్తుందనే చెప్పాలి.
చాలా పవర్ ఫుల్ డైలాగ్ ని చాలా ఈజ్ తో చెప్పిన బాలయ్య తనదైన మార్క్ చూపిస్తాడు అంటూ ప్రతి ఒక్కరూ ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా ఇలాంటి డైలాగులు ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయి అంటు బోయపాటి కూడా హామీ ఇచ్చాడు.
కాబట్టి ఈ సినిమా మరో భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ గా నిలవబోతుందా? అనేది కూడా చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది.
మరి వీళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాని ఎలాంటి ప్రెషర్ లేకుండా చాలా సాఫీగా తెరకెక్కించడానికి బోయపాటి శీను( Boyapati Srinu ) సిద్ధమవుతున్నారు.ఇక ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ నుంచి జరగబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి మొత్తానికైతే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి…
.