మొటిమలు.ముఖ సౌందర్యాన్ని చెడగొట్టేయడంలో ఇవి ముందు వరసలో ఉంటాయి.వీటిని ఎంత దాచి పెట్టాలని ప్రయత్నించినా అస్సలు దాగవు.ఈ క్రమంలోనే మొటిమలును నివారించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే కొందరికి మొటిమలు వచ్చాయంటే ఎన్ని చేసినా పోనే పోవు.అవే మొండి మొటిమలు అంటారు.
వీటిని ఎలా తగ్గించుకోవాలో అర్థంగాక చాలా మంది మానసిక క్షోభకు గురవుతుంటారు.
అయితే ఇకపై చింతించకండి.
ఎందుకంటే, మొండి మొటిమలను సలుభంగా నివారించే ఔషధం మీ వంటింట్లోనే ఉంది.అదే జీలకర్ర.
అవును, మొండి మొటిమలనైనా, వాటి తాలూకు మచ్చలనైనా పోగొట్టడంలో జీలకర్ర అద్భుతంగా సమాయపడుతుంది.మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జీలకర్రను ఎలా స్కిన్‌కి యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో రెండు స్పూన్ల జీలకర్ర వేసి బాగా మరిగించాలి.ఆ తర్వాత నీటిని వడబోసుకుని చల్లారనివ్వాలి.ఇప్పుడు రెండు స్పూన్ల జీర వాటర్‌లో ఒక స్పూన్ అలోవెర జెల్ వేసి మిక్స్ చేసుకోవాలి.అపై దూది సాయంతో ఈ మిశ్రమాన్ని మొటిమలపై కాకుండా ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి.
రాత్రి నిద్రించే ముందు ఇలా చేసి.ఉదయాన్నే చల్లటి నీటితో ఫేస్ వాస్ చేసుకోవాలి.
ఇలా రోజూ చేస్తే మొండి మొటిమలు మరియు నల్ల మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.
అలాగే జీలకర్రతో మరో అద్భుతమైన టిప్ ఏంటంటే.
ఒక బౌల్‌లో ఒక స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు కస్తూరి పసుపు, ఒక స్పూన్ తేనె వేసుకుని పేస్ట్‌లా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేసి ముప్పై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేసినా మొండి మొటిమలు తగ్గు ముఖం పడతాయి.