జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ప్రశాంత్ నీల్ కాంబినేషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ కాంబినేషన్లలో ఈ కాంబోలో సినిమా కోసం ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.1969 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం అందుతోంది.జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఏకంగా 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ అక్టోబర్ నెలలో మొదలుకానుందని అయితే తారక్ మాత్రం డిసెంబర్ నెలలో షూట్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ స్క్రిప్ట్ మాత్రం అద్భుతంగా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్( Mythri Movie Makers) నిర్మాతలు ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
2026 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.సంక్రాంతికి విడుదలైన తారక్ సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ గా నిలిచాయి.జూనియర్ ఎన్టీఆర్ తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకునే ప్రాజెక్ట్ లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ హీరోలలో ఒకరు కాగా తారక్ ఖాతాలో మరిన్ని భారీ విజయాలు చేరితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ ( Remuneration)అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.ప్రశాంత్ నీల్ తారక్ కు వీరాభిమాని కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా పెరిగాయి.
జూనియర్ ఎన్టీఆర్ కోరుకున్న భారీ విజయం ఈ సినిమాతో దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.తారక్ కెరీర్ ప్లాన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.