కౌంటింగ్ కౌంట్ డౌన్ షురూ... పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ అనిశెట్టి దుప్పలపల్లి గోడౌన్స్ నందు ఏర్పాటు చేసిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా,సజావుగా జరిగేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికతో పాటు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత జిల్లా పరిధిలో ఏ చిన్నపాటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 630 మంది అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పి చందనా దీప్తి అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రంలో పోలిస్ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్బంగా కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నలుగురు కంటే ఎక్కువగా గుంపులు గుంపులుగా తిరగటం చేయకూడదని తెలిపారు.అదేవిధంగా ఎన్నికల నియమావళి ప్రకారం అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు,విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదన్నారు.

Counting Countdown Tight Security Arrangements SP Chandana Deepti, Elections Cou

అభ్యర్థులు,ఏజెంట్లు లెక్కింపునకు హాజరయ్యే అధికారులు సెల్ ఫోన్లు, నిషేధిత వస్తువులైన అగ్గిపెట్టెలు,లైటర్,ఇంక్ బాటల్స్,లిక్విడ్,వాటర్ బాటిల్స్,పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద విధులకు హాజరయ్యే ప్రధాన ఏజెంట్లు/కౌంటింగ్ ఏజంట్లు/మీడియా ప్రతినిధులు ఎన్నికల అధికారి జారీచేసిన ఫోటో గుర్తింపు కార్డు తప్పక వెంట ఉంచుకొని తనిఖీలు చేసే పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు.

వాహనాలకు ట్రాపిక్ ఇబ్బంది కలగకుండా కేటాయించిన పార్కింగ్ స్థలంలోనే వాహానాలు పార్క్ చేయాలన్నారు.ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు.

Advertisement
మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా మారాలా.. అయితే మీరీ న్యాచురల్ ఫేస్ వాష్ వాడాల్సిందే!

Latest Nalgonda News