గృహ కార్మికులకు సమగ్ర చట్టాలు అమలు చేయాలి: జిల్లా కోఆర్డినేటర్ కాస అనసూర్య

సూర్యాపేట జిల్లా: పనిచేసే యజమానుల గృహాలను పని ప్రదేశాలుగా గుర్తించి, గృహ కార్మికుల కోసం సమగ్ర చట్టం అమల్లోకి తెచ్చి,కనీస వేతనాలు అమలు చేయాలని రాష్ట్ర గృహ కార్మికుల యూనియన్ సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ కాస అనసూర్య అన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలో యునియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గృహ కార్మికులుగా పనిచేస్తున్న వర్కర్లకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి,గృహ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ మంజూరు చేయాలని కోరారు.భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించే హక్కులు ఉంటాయని, కానీ,ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదని,సాటి మనిషిని మనిషిలాగా చూడటం లేదని,కొన్ని సందర్భాల్లో సమాజం కూడా హక్కుల్ని హరించి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Comprehensive Laws Should Be Implemented For Domestic Workers District Coordinat

జాతి,వర్ణ,లింగ,కుల,మత,రాజకీయ పరమైన వివక్షత ఉండకూడదన్నారు.రాజ్యాంగం ప్రసాదించిన విద్యా,సమానత్వ,స్వాతంత్ర్యపు హక్కులను కల్పించాలని,అలాగే గృహ కార్మికులకు ఇఎస్ఐ,పిఎఫ్ సౌకర్యం కల్పించి,గృహకార్మికులను కార్మికుల్లాగా గుర్తించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ కార్మికుల యునియన్ జిల్లా అధ్యక్షురాలు పాల్వాయి సుహాసిని, ఉపాధ్యక్షురాలు ఎన్.పద్మ,జిల్లా కోశాధికారి కొమ్మరాజు నాగమ్మ,జిల్లా కార్యదర్శి శారద,నిర్మల, మల్లిక,రేణుక,రాములమ్మ,మరియమ్మ,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
టీ, కాఫీ బదులు ఈ డ్రింక్ తాగితే ఆరోగ్యమే కాదు అందం కూడా పెరుగుతుంది!

Latest Suryapet News