వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

నల్లగొండ జిల్లా:ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశంపై నేడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు.

మాదిగ, మాదిగ ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసిందని గుర్తు చేస్తూ,2023 డిసెంబర్ 23 న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రి దామోదర రాజనర్సింహ అధ్వర్యంలో అడ్వకెట్ జనరల్ ను సుప్రీం కోర్టుకు పంపించామన్నారు.వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారని, తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు.

వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా మాదిగ,మాదిగ ఉప కులాలకు రెజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తామని ప్రకటించారు.

ఆ సినిమాలో వైష్ణవి చైతన్యను బ్యాడ్ గా చూపిస్తారట.. అలాంటి బూతులు మాట్లాడుతుందా?
Advertisement

Latest Nalgonda News