మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో దాదాపుగా అన్ని రకాల పాత్రలను పోషించారు.అయితే రీఎంట్రీలో చిరంజీవి ఎలాంటి పాత్రలను ఎంచుకుంటే కెరీర్ పరంగా సక్సెస్ అవుతారనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపించాయి.
వాల్తేరు వీరయ్య సినిమాతో ఫ్యాన్స్ తన నుంచి ఎలాంటి సినిమాలను కోరుకుంటారో చిరంజీవికి సైతం అర్థమైంది.ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటించాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారని బోగట్టా.
వాల్తేరు వీరయ్య సక్సెస్ అనంతరం భోళా శంకర్ సినిమా కథకు సంబంధించి చిన్నచిన్న మార్పులు చేశారని సమాచారం అందుతోంది.వేదాళం రీమేక్ అయిన భోళా శంకర్ సినిమాలో అభిమానులు ఏం కోరుకుంటారో ఆ అంశాలన్నీ పుష్కలంగా ఉంటాయని సమాచారం.
ఆచార్య, గాడ్ ఫాదర్ ఎందుకు నిరాశపరిచాయనే ప్రశ్నకు సమాధానం సైతం చిరంజీవికి తెలిసిందని తెలుస్తోంది.
మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమాకు దర్శకుడు కాగా స్ట్రెయిట్ సినిమాలతో ఈ దర్శకుడు నిరాశపరిచినా రీమేక్ సినిమాలతో విజయాలను అందుకున్నారు.భోళా శంకర్ సినిమాలో కామెడీకి పెద పీట వేస్తున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలో చిరంజీవి డ్యాన్స్ లు సైతం స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది.
శేఖర్ మాస్టర్ ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారని బోగట్టా.
వాల్తేరు వీరయ్య సినిమాలా భోళా శంకర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి. తమన్నా, కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించడంతో రిజల్ట్ విషయంలో మేకర్స్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఈ ఏడాదే విడుదల కానున్న భోళా శంకర్ మూవీ చిరంజీవి కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందో లేదో చూడాలి.
చిరంజీవి ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా సీనియర్ హీరోలలో ఈ రేంజ్ పారితోషికం అందుకుంటున్న ఏకైక హీరో చిరంజీవి అనే సంగతి తెలిసిందే.