ఇది అమ్మోరు కత్తి బాబోయ్ : బాయ్ ఫ్రెండ్స్ ఇచ్చిన ఐ ఫోన్లతో ఇల్లు కొన్న ప్రియురాలు....

ఇల్లు అనేది మధ్య తరగతి ప్రజలకు ఒక కల.ఈ కలను నిజం చేసుకోవడానికి కొంత మంది ప్రజలు రాత్రింబవళ్ళు కష్ట పడుతుంటారు.

 Chinese Woman Asked 20 Boyfriends To Buy Her Iphone 7. She Sold Them All To Buy-TeluguStop.com

అయితే ఒక్కోసారి కొంతమంది తమ కలను నెరవేర్చుకాకుండానే కాలం చేస్తుంటారు.కానీ ఆ యువతి మాత్రం కచ్చితంగా ఇల్లు కొనుక్కోవాలని బలంగా ఫిక్స్ అయ్యింది.

దీంతో తన శరీరాన్ని ఆయుధంగా చేసుకుంటూ యువకులకి ప్రేమ వల విసిరింది.ఇంకేముంది ఏడాదిలో ఇల్లు కొనుక్కుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే చైనా దేశంలో చయో లీ అనే యువతి నివాసం ఉంటోంది.అయితే ఈమె చిన్నప్పటినుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ పెరిగింది. దీంతో వయసు వచ్చాక ఎలాగైనా సరే ఇల్లు కొనుక్కోవాలని నిర్ణయించుకుంది.దీంతో తనపై మోజు పడిన మగాళ్లను ఉపయోగించుకుని తాను ఇల్లు కొనుక్కోవడానికి కావలసిన డబ్బును సమకూర్చుకుంది.

ఎలాగంటే తనని ప్రేమ పేరుతో లొంగదీసుకోవాలని వచ్చేటువంటి ప్రేమికులను తనకి ఖరీదైన ఐ ఫోన్ ని గిఫ్ట్ గా ఇవ్వాలంటూ కోరింది.ఇలా దాదాపుగా 20 మందితో పైగా చయో లీ ఐ ఫోన్ లనే బహుమతిగా తీసుకుంది.

ఆ తరువాత వాటిని దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్ కి తీసుకెళ్లి అమ్మేసింది.అయితే ఈ ఐ ఫోన్లను అమ్మగా దాదాపుగా ఇండియన్ కరెన్సీ లో 15 లక్షల రూపాయలకు పైగా డబ్బు వచ్చింది.

ఇంకేముంది దగ్గరలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులను సంప్రదించిన చయో లీ మంచి ఇల్లు కొనుక్కుంది.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

అయితే ప్రేమ పేరుతో మగాళ్లని వంచించి ఖరీదైన బహుమతులని తీసుకొని మోసం చేసి ఇల్లు కొనుక్కుందని కొందరు కామెంట్లు చేసినప్పటికీ చయో లీ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube