దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీ ఎత్తున నమోదు అవుతున్నాయి.సెకండ్ వేవ్ నేపథ్యంలో పెద్ద మొత్తంలో కేసులు ఈ సమయంలో నమోదు అవుతున్న కారణంగా ఎక్కడికి అక్కడ లాక్ డౌన్ ను విధించారు.
పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ లో ఉన్నాయి.ఇక కరోనా సెకండ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
ఉత్తరాఖండ్ లో గడచిన పది రోజుల్లో ఏకంగా వెయ్యికి పైగా కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తుంది.
కరోనా పంజా పిల్లలపై ప్రభావం తక్కువ అంటున్నారు.
కాని ఉత్తరాఖండ్ లో మాత్రం కరోనా ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉందట.ఏడాదిలో మొత్తం 2131 మంది కరోనా బారిన పడగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి.
ప్రతి పది పదిహేను రోజుకులకు వెయ్యి కేసుల చొప్పున నమోదు అవుతున్నట్లుగా ఉత్తరాఖండ్ ఆరోగ్య శాక పేర్కొంది.ఈ సమయంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సెకండ్ వేవ్ లోని కొత్త వేరియంట్ కారనంగా పిల్లలకు కరోనా బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లో పిల్లల శాతం తక్కువే.కాని ముందు ముందు కొత్త వేరియంట్ ల కారణంగా పిల్లల కేసులు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు.