కొండెక్కిన కోడి ధర

నల్లగొండ జిల్లా: చికెన్ ధరలు రోజురోజుకు పై పైకి పెరిగిపోతున్నాయి.హైదరాబాద్ నగరంలో కిలో స్కిన్ లెస్ రూ.

294 కి చేరింది.విత్ స్కిన్ చికెన్ ధర రూ.258 గా ఉంది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కిలో స్కిన్ లెస్ రూ.300, విత్ స్కిన్ చికెన్ ధర రూ.260 నడుస్తుంది.వేసవి తాకిడికి కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయని వ్యాపారస్తులు చెబుతున్నారు.గత ఆదివారం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర ఇప్పటికంటే సుమారు రూ.30 రూపాయలు తక్కువగా ఉంది.రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు అభిప్రాయపడుతున్నారు.

దీనితో చికెన్ ప్రియులకు కాస్త భారం పడకతప్పని పరిస్థితి నెలకొంది.

Advertisement

Latest Nalgonda News