వర్షంతో చండూరు అస్తవ్యస్తం

చండూరు మున్సిపాలిటీలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షాలకి రోడ్లన్నీ చెరువులను తలపించాయి.

అధికారుల, కాంట్రాక్టుల నిర్లక్ష్యంతో ఆరు నెలల నుంచి ఆగిన డ్రైనేజీ (Drainage)పనుల వల్ల చండూర్ మున్సిపాలిటీ(Chandur Municipality) రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి.

ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగడంతో వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ,కమీషనర్, కౌన్సులర్లతో కలిసి డ్రిల్లింగ్ మిషన్లు,జేసీబీ సహాయంతో దగ్గరుండి పనులన్నీ చేయించారు.ఈ సహాయక చర్యల్లో 4 వార్డు కౌన్సిలర్ అన్నపర్తి శేఖర్ 6వ వార్డు కౌన్సిలర్ కొనరెడ్డి యాదయ్య, మున్సిపల్ కమిషనర్ మణికరణ్,కో ఆప్షన్ సభ్యులు రావిరాల నాగేష్, మరియ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Chandur Is Chaotic With Rain, Chandur, Nalgonda, Drainage, Chandur Municipality,

Latest Nalgonda News